కల చెదిరింది కథ మారింది…జగన్ కు కన్నీరే మిగిలింది !

-

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల పరాజయంతో కొంతమంది మంత్రులు ఉలిక్కిపడ్డారని, వారిని ఎక్కడ పిలిచి కొడతారోనని, మంత్రి పదవి నుంచి తప్పిస్తారోనని, కానీ కడపలో కూడా అధికార పార్టీ అభ్యర్థి ఓటమి చెందడంతో ఊపిరి పీల్చుకున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

పులివెందులలోనే కొరలు పీకి వేయడంతో మంత్రులపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీకి చెందిన వారు కల ఇదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే జగన్ ఇంతేను లే అని పాట పాడుకుంటుండగా, మరి కొంత మంది కల చెదిరింది, కథ మారింది… కన్నీరే ఇక మిగిలింది… జగన్ కు ఇక కన్నీరే మిగిలిందని పాట పాడుకుంటున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఇన్ని తప్పులు చేసిన వారికి ఇంత శిక్ష పడకుండా తప్పుతుందా అని తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఆక్టివ్ కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారని, 2017 లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి నెగ్గితే, మార్పు మొదలయ్యిందని సాక్షి దినపత్రికలో రాశారని గుర్తు చేశారు.

 

ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయిందని, ఇప్పుడు కూడా ప్రజల్లో మార్పు మొదలయ్యిందని, పశ్చాత్తాపంతో గ్రాడ్యుయేట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని, అయినా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్లు మా ఓటర్లు కాదని పేర్కొనడం సిగ్గుచేటని, సజ్జల గారి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని, వీళ్లు మన ఓటర్లు కాకపోతే అరవ వాళ్ళా సార్ అంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. టీడీపీ అభిమానులను ఇళ్లల్లో కట్టిపడేసి, అరవ వాళ్లను అరువుకు తెచ్చుకొని కుప్పం లాంటి చిన్న మున్సిపాలిటీని గెలుచుకున్న తర్వాత వై నాట్ 175 అని మనం అన్నామని, ఇప్పుడు పులివెందులలో పరాజయం తర్వాత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version