రికార్డింగ్ డాన్స్ చూసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు : రఘురామ కృష్ణంరాజు

-

కూచిపూడి కళాక్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి దుర్గేష్, రఘురామకృష్ణంరాజును.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మూడు దశాబ్దాల క్రితం సిద్ధేంద్ర యోగి క్షేత్రం మీదుగా ఆవిర్భవించిన కూచిపూడి నృత్యం.. నేడు ప్రపంచవ్యాప్తంగా దశదిశలా విరాజిల్లుతుంది అని ఆయన అన్నారు. అలాగే భాషకు, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.

దురదృష్టవశాత్తు మన భాషను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని అంతం చేసే ప్రభుత్వమే ఐదేళ్లుగా ఉంది ..అని నాలాంటి వాళ్ళు ఎంతో బాధపడే వాళ్ళం. రికార్డింగ్ డాన్స్ చూసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. కూచిపూడి చూసేవాళ్ళు తక్కువ అయిపోయారు. కూచిపూడి నృత్యం గురించి ప్రపంచంలో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో చెప్పాల్సిన అవసరం ఉంది. కూచిపూడి మొక్క చిత్రం మార్చాల్సిన అవసరం ఉంది. కానీ నేడు వాటిని కాపాడే ప్రభుత్వం రావడం ఎంతో సంతోషకరం. మన ఆంధ్ర సాంప్రదాయ నృత్య కళ కూచిపూడిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడంలో.. ఎందరో మహానుభావులు తమ జీవితాలను అంకితం చేశారు అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news