ప్రేమ ఉంటే పేర్ని నాని గోడౌన్ తన పేరు మీద పెట్టుకునే వాడు : బుద్ధా వెంకన్న

-

మాజీ మంత్రి పేర్ని నాని చిలక పలుకులు మాట్లాడుతున్నాడు అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఎవరినీ కించ పరిచే ఉద్దేశ్యం చంద్రబాబుకి ఉండదు.. అది ఆయన మనస్తత్వం. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి, బ్రహ్మణి లను వైసీపీ కుక్కలు మొరిగితే నాని మాట్లాడలేదు. తప్పుగా అప్పుడు మా వైసీపీ నేతలు మాట్లాడారని నాని ఇప్పుడు కూడా లెంపలు వేసుకోవటం లేదు. వంశీ, కొడాలి నాని లను నేను సంకర జాతి కుక్కలు అని గతంలో తిడితే పేర్ని నాని నా మీద కేసు పెట్టాడు.

చంద్రబాబు, లోకేష్, పవన్ పై సినిమా తీయటానికి వర్మ పేర్ని నానిని కలిసి చర్చ జరపటం వాస్తవం కాదా.. కట్టుకున్న భార్యను ఈ కేసులో పేర్ని నాని ఇరికించారు. భార్య మీద నిజంగా ప్రేమ ఉంటే పేర్ని నాని గుడౌన్ తన పేరు మీద పెట్టుకునే వాడు. భువనేశ్వరి మీద మాట్లాడిన వంశీ, కొడాలి నానితో చెట్టాపట్టాల్ వేసుకుని పేర్ని నాని తిరిగాడు. ఇప్పుడు మహిళల మీద ఇలా మాట్లాడతారా అంటూ మాటలు చెబుతున్నాడు. పేర్ని నానిని ఎందుకు అరెస్టు చేయకుండా ఉంటారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని చెప్పిన నాని ఇపుడు అదే జరుగుతుంది అని తెలుసు కోవాలి అంటూ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news