వైకాపాలో తుఫాన్: ఒక సెల్ఫీ… ఎన్నో క్లారిటీలు… మరెన్నో ఆరాలు!

-

ఏపీలో తిరుగులేని శక్తిగా మారిన అధికార వైకాపాకు బయటనుంచి పెద్దగా తలనొప్పులు లేవుకానీ.. ఇంటిపోరు వ్యవహారాలు మాత్రం వీదికేక్కి రచ్చ చేస్తున్నాయి. ప్రస్తుతం అధినేత జగన్ కు ఈ తలనొప్పులు ఎక్కువ డిస్ట్రబ్ చేస్తున్నాయని అంటున్నారు సీనియర్లు! ఈ ఇంటిపోరు వ్యవహారాల్లో మిగిలిన వారందరికంటే ఎక్కువ మార్కులు పొందింది మాత్రం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు! ఇప్పుడు ఆయనతో పాటు – ఆనం రాం నారాయణ రెడ్డి కలిసున్న ఒక ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. ఫలితంగా వైకాపాలో తుఫానుకు కారణమైంది!

వైకాపాలో రెబల్ ఎంపీగా మారిపోయారు రఘురామకృష్ణంరాజు. అయితే ఆయనతో ఆడిస్తుంది, వెనక ఉండి నడిపిస్తుంది మాత్రం బీజేపీ పెద్దలు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయన – పవన్ కలిసి మరికొందరు వైకాపా నేతలను లాక్కోగలిగితే… భవిష్యత్తులో ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టొచ్చని భావిస్తోంది బీజేపీ! ఈ క్రమంలో మొన్నటివరకూ కాస్త దిక్కార స్వరం వినిపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో రఘురామకృష్ణంరాజు దిగిన ఈ సెల్ఫీ చాలా విషయాలపై క్లారిటీ ఇస్తుందని అంటున్నారు!

2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఈ సీనియర్ నేత ఆనంకి.. సామాజిక సమీకరణాలు సెట్ కాక మంత్రి పదవి రాలేదు! దీంతో నాటి నుంచీ జగన్ తీరుపై ఆయన గుర్రుగా ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం సంగతి కాసేపు పక్కన పెడితే… పార్టీకి చెందిన మరో అసంతృప్తి నేతగా ముద్ర పడిన రఘురామరాజుతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే.. ఈ ఫోటో ఎప్పుడు దిగారు? ఎక్కడ దిగారు? ఇద్దరూ కలిసి ఎవరిని కలిశారు? అన్న అంశాలపై జగన్ పార్టీ పెద్దలు ఆరా తీయటం మొదలైనట్లు తెలుస్తోంది.

వైకాపాలో ఉన్న అసంతృప్త నేతలతో ఆర్.ఆర్.ఆర్. టచ్ లో ఉంటూన్నారని.. వారికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో భరోసా కల్పిస్తున్నారని.. వీరందరినీ ఒక తాటిపైకి తెచ్చి కాషాయ కండువాలు కప్పాలని ప్లాన్ చేస్తున్నారని కథనాలు వస్తోన్న క్రమంలో… అందులో భాగంగానే రఘురామకృష్ణంరాజు – ఆనం రాం నారాయణ రెడ్డి కలిసి ఉండొచ్చని ఊహాగాణాలు వెళువడుతున్నాయి!

ఏది ఏమైనా… ఆయన తో పాటు చాలా మందిని రెబల్స్ ని చేసి, ఆ రెబల్స్ అందరినీ కాషాయం గూటికి చేర్చే పనిలో భాగంగా… ఆర్.ఆర్.ఆర్. స్కెచ్ లు బాగానే పనిచేస్తున్నట్లున్నాయని.. ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారని అంటున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Exit mobile version