వాలంటీర్ వ్యవస్థనే వ్యర్ధం అనుకుంటే వారికి ట్రైనింగ్ పేరిట ఇన్వాయిస్ రైజ్ చేసి గత నాలుగేళ్లలో ఈ ప్రభుత్వ పెద్దలు 270 కోట్ల రూపాయలను ఎత్తారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. వాలంటీర్ల శిక్షణ కోసం ప్రతి ఏటా 68 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి చెందిన తమ పార్టీ నాయకుడు ఒకరు రామ్ ఇన్ఫో కంపెనీని ఇన్ డైరెక్ట్ టేకోవర్ చేయగా, ఆ కంపెనీకి వాలంటీర్ల శిక్షణ బాధ్యతలను అప్పగించారని ఫైర్ అయ్యారు.
raghurama volunteers training
వాలంటీర్ల శిక్షణ కోసం దాదాపు 300 కోట్ల రూపాయల పైగానే ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, గత నాలుగేళ్లలో 270 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీంలో భాగంగా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ నిచ్చినదానికే ఈ ప్రభుత్వం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తే, ఏమీ చేయని దానికి డబ్బులు ఖర్చు చేసిన వారిని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఊరుకుంటామని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్మును ఇదే మాదిరిగా ఎంతో దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.