తిరుమల దేవున్ని వదిలేయండి బాబోయ్‌ : రఘరామ

-

ఢిల్లీ : నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి జగన్‌ సర్కార్‌ ఫైర్‌ అయ్యారు. రాజకీయాల్లో విలువలను కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని… న్యాయశాఖ మంత్రిని కలిసి ఫిరాయింపు దారుల పై చర్యలు తీసుకోవాలని చట్టానికి సవరణలు చేయాలి మా ఎంపీలు కోరారని తెలిపారు. వైసీపీ సర్కార్‌ తిరుపతి వెంకన్నను కూడా వదలడం లేదని మండిపడ్డ రఘరామ….ఇప్పుడు మళ్లీ రూ. 50 కోట్లు తీసుకోవాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని ఫైర్‌ అయ్యారు.

” మరి కొన్ని రోజుల్లో వెంకన్న నగలు కూడా అమ్మేస్తారేమే.. తాగుబోతుల తలకాయలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. మా దేవుడిని వదిలేయండి వేడుకుంటున్నాను” అంటూ రఘరామ వైసీపీ సర్కార్‌ ను వేడుకున్నారు. తాను ఎక్కడ షెడ్యూల్ 10ను ఉల్లంఘించలేదన్నారు. స్పీకర్ తమ్మినేనికి లేఖ రాశాను.ఫిరాయింపు కేసులు ఏమైనా స్పీకర్ ని చర్యలు తీసుకోవాలని కోరానని తెలిపారు. విలువలను , గొప్ప అంశాలని, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ చూయించాలని డిమాండ్‌ చేశారు. కర్నూల్ కి హైకోర్టు మార్చాలని కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసి కోరారని.. న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారు, ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని మండిపడ్డారు. పార్టీ హెడ్ క్వారటర్స్ మర్చినంత త్వరగా కోర్టును మారుస్తారా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version