కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసింది. 134 రోజుల్లో 4,084 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగింది. యాత్ర చివరి రోజైన ఆదివారం నాడు.. సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఆదివారం శ్రీనగర్‌లోని చారిత్రక లాల్‌చౌక్‌లో భారీ భద్రత మధ్య త్రివర్ణ పతాకాన్ని రాహుల్ ఎగురవేశారు.
ఇవాళ షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభతో యాత్రకు అధికారికంగా ముగింపు పలుకుతారు. వివిధ ప్రతిపక్షాల నేతలు ఈ సభకు హాజరవుతారు. బీజేపీ-ఆరెస్సెస్ కారణంగా విద్వేషాలు వ్యాపించిన దేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా తాము ప్రేమ దుకాణాలు తెరిచామని రాహుల్ అన్నారు. ఈ యాత్రతో దేశానికి ఒక ప్రత్యామ్నాయ దృక్కోణం అందించామని చెప్పారు.
‘‘ఈ యాత్రలో లక్షలాది ప్రజలను కలిశాను. వారితో మాట్లాడాను. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఈ యాత్ర కొనసాగింది. మాకు అద్భుతమైన ప్రేమతో కూడిన స్పందన లభించింది’’ అని రాహుల్’ అని పేర్కొన్నారు.