నిరుద్యోగం వంటి అంశాలు దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఈ సమస్యల్ని పరిష్కరించకుండా వీటి నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ట్రై చేస్తోంది అని అన్నారు. భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భం గా మహారాష్ట్రలో ధూలే జిల్లా లోని దొండైచ గ్రామం లో బుధవారం జరిగిన సభలో ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. దేశంలో దళితులు గిరిజనులు మైనారిటీలకు ప్రాతినిథ్యం లేదని అన్నారు సంపన్నులకి 16 లక్షల కోట్లని మాఫీ చేసిన బిజెపి ప్రభుత్వం రైతులకు ఎందుకు మాఫీ చేయట్లేదు అన్నారు దేశంలో 70 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సంపద 22 మంది వద్ద ఉన్నదానికి సమానమని చెప్పారు అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.