హర్యానా ముఖ్యమంత్రి నయా సీఎం గా సైని నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో మెజారిటీ ఓటుతో విజయాన్ని సాధించింది మెజార్టీ కి 46 మంది సభ్యులు అవసరం ఉంది. 41 మంది బిజెపి 10 మంది స్వతంత్ర అభ్యర్థుల మద్దతు లభించింది. సులువుగా నెగ్గారు. అంతకుముందు సీఎం సైని సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
సుమారు రెండు గంటలు చర్చ తర్వాత ఓటింగ్ నిర్వహించారు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే జననాయక్ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సభ నుండి వాక్ అవుట్ చేశారు పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు సైతం సభకి గైర్హాజరు కావాలని విప్ జారీ చేసింది. బిజెపి పార్టీతో ఇప్పుడు వరకు ప్రభుత్వాన్ని నడిపిన లోక్సభ సీట్ల పంపకంలో తేడా రావడంతో జేజేపి మద్దతు ఉపసంహరించుకుంది ఈ నేపథ్యంలో సీఎం మనోహర్లాల్ కట్టర్ రాజీనామా చేశారు సైని నూతన సీఎం గా ఎన్నికయ్యారు.