రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పని రాహుల్ గాంధీ..!

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో పలువురు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ప్రతిపక్షనేతలు ఇలా అందరూ శుభాకాంక్షలు చెప్పారు. కానీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాత్రం ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం గమనార్హం.  రేవంత్ రెడ్డి మీద రాహుల్ గాంధీ గత కొంతకాలంగా  కోపంగా ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

దాదాపు 3 నెలలుగా ఢిల్లీ కి వెళ్తున్న రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు రాహుల్ గాంధీ.  రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, రుణమాఫీ సభలకు పిలిచినా రాలేదు రాహుల్ గాంధీ. కానీ బీసీ కులగణన సమయంలో వచ్చాడు. అప్పుడు కూడా ఏదో వచ్చామా అంటే వచ్చాం అన్నట్టుగా రేవంత్ తో అంత క్లోజ్ గా కనిపించలేదని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే  అదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ రాహుల్ గాంధీకి కాస్త  ఆగ్రహానికి గురైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈరోజు రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version