వైసీపీ సామజిక మాద్యమ కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని అరెస్ట్ చేసారు పోలీసులు. మహబూబ్ నగర్ సరిహద్దులో రవీంద్రా రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. భారీ భద్రత నడుమ కడపకు తరలిస్తున్నారు. అయితే ఏపీలో గత కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు అనేవి జరుగుతున్నాయి అనేది తెలిసిందే. ఈ విషయంపైనే నిన్న ఏపీ హై కోర్ట్ లో పిటిషన్ కూడా వేశారు వైసీపీ నేతలు.
అయితే నాలుగు రోజులు క్రితం వర్రా రవీంద్రా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కడప పోలీసులు. కానీ 41ఎ నోటీసులు జారిచేసి వదిలివేశారు తాలూకా పోలీసులు. మీడియా అని అన్నమయ్య జిల్లా పోలీసుల నుంచి జారుకున్న వర్రా అదృశ్యం కావడంతో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసారు పోలీసులు. గత నాలుగు రోజులుగా జల్లెడ పట్టిన పోలీస్ బృందాలు.. మహబూబ్ నగర్ సరిహద్దు ప్రాంతంలో వర్రా రవీంద్రా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం భారీ బందోబస్త్ నడుమ కడపకు తరలిస్తున్నారు పోలీసులు.