తాజాగా రాహుల్ గాంధీ కేంద్ర సర్కారు పనితీరు పై తీవ్రంగా విరుచుకు పడ్డాడు. చైనా దేశంతో ఏర్పడిన ఘర్షణ పూరిత వాతారణాన్ని సంబంధించిన అబద్ధాలు భారత ప్రజలకు ప్రచారం చేస్తూ దేశాన్ని మోసం చేస్తున్నాడని తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. అలాగే దేశ రక్షణకు భంగం కలిగించే వారికి, దేశ సరిహద్దులను బలహీనపరిచే లాంటి చర్యలకైనా తమ పార్టీ మద్దతు ఉండదని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించారు.
దేశంలో కరోనా ను ఎదుర్కొనే విషయంలో దేశంలోని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన సమయంలో మోడీ సర్కార్ చల్లగా జారుకుందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఈ వ్యవహారం రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదని దేశ సరిహద్దుల విషయంలో మేం కఠినంగా ఉంటామని రాహుల్ తెలియజేశారు. ఇదే నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని రేవా లో అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టును భారత దేశానికి అంకితం చేసిన ప్రధాని మోడీ విషయంలో PMO కార్యాలయం చేసిన ట్వీట్ పై రాహుల్ గాంధీ స్పందించారు. ఆ ట్వీట్ ను రాహుల్ గాంధీ రీ ట్వీట్ చేస్తూ దానికి ” అసత్యాగ్రహి ” అంటూ క్యాప్షన్ జతచేశారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”mr” dir=”ltr”>असत्याग्रही! <a href=”https://t.co/KL4aB5t149″>https://t.co/KL4aB5t149</a></p>— Rahul Gandhi (@RahulGandhi) <a href=”https://twitter.com/RahulGandhi/status/1281794906948726784?ref_src=twsrc%5Etfw”>July 11, 2020</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>