నోరు జారినందుకు రాహుల్ కి నోటీసులు..

-

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు  జారీ చేసింది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్‌ మోసపూరితమైన విర్శలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నోటీసులు పంపారు. ప్రధాన మంత్రి నరేద్ర మోడీకి తనను కాపాడుకోవడానికి ఓ మహిళ దొరికారు అని రాహుల్‌ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా రాహుల్ ఉపయోగించిన పదజాలంపై మహిళా కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘56 అంగుళాల ఛాతీ గల వాచ్‌మ్యాన్‌ పారిపోయి ఓ మహిళకు చెప్పాడు.. సీతారామన్‌ జీ, నన్ను కాపాడండి.. నన్ను నేను కాపాడుకోలేను అని అడిగారు. రెండున్నర గంటల పాటు ఆమె ఆయనను రక్షించలేకపోయారు.

సూటిగా నేనడిగిన ప్రశ్నకు… యస్‌ లేదా నో అని సమాధానం చెప్పమన్నాను. కానీ ఆమె చెప్పలేదు’ అని రాహుల్‌ ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ సీతారామన్ ని తక్కువ చేస్తు మట్లాడారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రఫేల్ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో తాజాగా రాహుల్ కి నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version