కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ రోజు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ఈరోజు ఈస్టర్ ను కేరళలోని ప్రచారంలోనే జరుపుకున్నాడు. ఒక అనాధాశ్రమంలో పిల్లలతో కలిసి భోజనం చేశాడు. వయనాడ్ లో కల్పేట నగరంలోని జీవన్ జ్యోతి చిల్డ్రన్ హోమ్ వద్ద ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్‌లోడ్ చేస్తూ, గాంధీ ఇలా వ్రాశారు: “జీవన్ జ్యోతి చిల్డ్రన్స్ హోమ్‌లో నా అద్భుతమైన కొత్త స్నేహితులతో ఒక ప్రత్యేక ఈస్టర్ భోజనం – ఒక అందమైన వర్చువల్ గెస్ట్ ఈ భోజనానికి విచ్చేశారు.” అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకురాలు, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వీడియో కాల్ ద్వారా అక్కడ ఉన్న పిల్లలను పలకరించారు. ఈ వారం ప్రారంభంలో తన భర్త రాబర్ట్ వాద్రాకి COVID-19 పాజిటివ్ రావడంతో ప్రియాంక తన ఢిల్లీ నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా కారణంగా ఆమె మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 6న జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్లను ఆకర్షించడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారు.