రుణమాఫీ, పన్ను తగ్గింపు.. ఇప్పుడు కొత్తది.. అర్థం చేసుకోండి : రాహుల్

-

మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఇటీవలే ప్రైవేట్ బ్యాంకు లోకి కార్పొరేట్లను అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంకు కార్యాచరణ బృందం సిద్ధం చేసిన సిఫారసులను తప్పుబడుతూ ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి అని సూచించారు.

కార్యక్రమాన్ని అర్థం చేసుకోండి… తొలుత కొన్ని బడా కంపెనీలకు కేంద్రం రుణమాఫీ చేసింది.. ఆ తర్వాత ఎన్నో కంపెనీలకు పన్ను తగ్గింపు కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు వీరు నెలకొల్ప పోయే బ్యాంకులకు నేరుగా ప్రజల ఆదా చేసుకున్న సొమ్మును అప్పగించేందుకు కేంద్రం సిద్ధమయ్యింది. ప్రజలు ఇప్పటికైనా దీనిని గమనించి అర్థం చేసుకోండి అంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఓవైపు ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా కేంద్రం తీరు పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version