ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇతను సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా బిగ్బాస్-3 లో విజేతగా నిలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత రాహుల్ పలు సినిమాలలో కూడా నటించారు. అంతేకాకుండా సొంతంగా ఆల్బమ్ లను క్రియేట్ చేశారు. ఇక రాహుల్ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే అతను కొన్ని సంవత్సరాల క్రితమే ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని అంతేకాకుండా వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే వాటిపై రాహుల్ ఎప్పుడు రియాక్ట్ అవలేదు. ఇక రీసెంట్ గా రాహుల్ ఎంగేజ్మెంట్ జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఆగస్టు 17వ తేదీన అంటే నిన్న రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ కు అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరి వివాహం ఎప్పుడో తెలియాల్సి ఉంది. ఈ ఫోటోలు చూసిన రాహుల్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, మరోవైపు రాహుల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల పారితోషికం అందించారు. రాహుల్ అద్భుతంగా పాటలు పాడతాడని తన గొంతు ఎంతో మధురంగా ఉంటుందని తన వంతు సహాయంగా తెలంగాణ ప్రభుత్వం కొంత మొత్తంలో విరాళం అందించింది. ఆగస్టు 15వ తేదీన ఈ విరాళాన్ని రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.