T20 ప్రపంచ కప్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇవాల్టి నుంచి పది రోజులపాటు ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా మొత్తం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ కు భారీ అడ్డంకి నెలకొంది. అక్టోబర్ 23వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు కూడా వరుస సూచన ఉంది.
సూపర్ 12 దశకు ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ఒకవేళ వర్షం పడి ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ రద్దు అయితే చెరో వస్తుంది. ఇలా జరిగితే తర్వాతే మ్యాచ్లలో రెండు జట్లకు ఇబ్బంది అవుతుంది. రన్ రేట్ ప్రకారం.. రెండు జట్లు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలాగే… ఈ మ్యాచ్ చాలా ఉద్వేగ భరితమైనది. యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే ఐసీసీకి భారీ నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ వర్షం పడకపోతే.. ఈ మ్యాచ్ యధా తదంగా నడుస్తుంది.