ఇప్పుడు ఏపీలో రాజకియాలు భగ్గుమంటున్నాయి.. అనేక చర్చలకు దారితీసాయి..జనసేన వర్సెస్ వైసిపి చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే..ప్రజా యాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. పట్టరాని కోపంతో ఊగిపోతూ అధికార పార్టీ నేతలపై బూతుల తో రెచ్చిపోయాడు. దానికి తగ్గట్టుగా వైసిపి నేతలు కూడా సమాధానం ఇస్తూ వస్తున్నారు. తాజాగా మరో వైసీపి నేత పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు. తనకే చెప్పులున్నట్లు పవన్ మాట్లాడారని మండిపడ్డారు.. మేం అంతకన్నా ఎక్కువ మాట్లాడగలమని చెప్పారు. ఆరు శాతం ఓటింగ్ ఉన్న పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడితే 50 శాతం ఓటింగ్ ఉన్న మేము మీదపడితే ఏమవుతుందో ఊహించుకో అని హెచ్చరించారు. పవన్, చంద్రబాబులు ఇద్దరూ వచ్చినా ఏమీ పీకలేరని అనిల్ వ్యాఖ్యనించారు.
పవన్, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చిరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఇలా మాట్లాడొచ్చా అని ఆయన ప్రశ్నించారు. 12 ఏళ్లు తనను ఎంతో తిట్టి, ఇబ్బంది పెట్టినా చిరునవ్వుతో వాటిని అధిగమించి సీఎం అయిన వ్యక్తి జగన్ అని తెలిపారు..అసలు నాయకుడు అంటే ఎలా ఉండాలో జగన్ అలా ఉన్నారు.. రాజకియాల్లో రానించాలంటే ప్రజల మెప్పు పొందాలి.. అంతేకానీ,ఇలా ఒకరిపై నోరు పారేసుకుంటే అవ్వరని అనిల్ అన్నారు. మరి ఈ విషయంపై జనసైనికులు ఎలా స్పందిస్తారో చూడాలి..