రానున్న గంటలో ఉత్తర భాగ్యనగరంలో భారీ వర్షం కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలోని.. పటాన్ చెరు, ఆర్‌సీపురం, హఫీజ్‌పేట్, మియాపూర్, కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్, అల్వాల్, బాలనగర్, నేరేడ్‌మెట్, కంటోన్మెంట్, కోంపల్లితో పాటు ధూల్‌పల్లి శివార ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వారం పది రోజుల పాటు ఎడతెరిపి లేకుండా రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో.. వరద నీరు పోటెత్తింది. వరదలు పొటెత్తడంతో జలశాయాలు నిండికుండల్లా మారాయి.
ఇదిలా ఉంటే.. వరద ప్రభావంతో కొన్ని చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా.. పలువురు వరదల్లో కొట్టుకుపోయారు. దీంతో ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. అయితే.. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. అయితే.. రాష్ట్రంలో వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా మూడోరోజు సమీక్ష నిర్వహించారు. ఇటీవల నాలుగైదు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలకు గోదావరి ఉప్పొంగగా.. వరదలు ముంచెత్తాయి. వరదలపై ఎప్పటికప్పుడు నేతలు, అధికారులతో ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరుసగా శనివారం వరుసగా మూడో రోజు మూడో రోజు మంత్రులు, అధికారులు విస్తృతంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.