హైదరాబాద్‌ పలు చోట్ల భారీ వర్షం.. బోనాలకు ఆటంకం

-

హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చింతల్‌, గాజులరామారం, జీడిమెట్ల, సూరారం, నాగారం, దుండిగల్‌, దమ్మాయిగూడలో వర్షం పడుతున్నది. కాప్రా, కుషాయిగూడ, ఎల్లారెడ్డిగూడతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. భద్రాచలంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. అలాగే నిర్మల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెంలో పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.

మరో వైపు రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీచేసింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో నేడు బోనాల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే మహిళలు బోనాలతో అమ్మవారికి ఊరేగింపు వెళ్తున్న సమయంలో వరుణుడు విజృంభించడంతో కొంత ఆసౌకర్యం నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version