తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈ రాష్ట్రంలో ఎందుకు జీవిస్తున్నాము అనుకునేంతలా వర్షాలు తమపై పగబట్టి కురుస్తున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి, ఈ రోజు అయితే అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వాతావరణశాఖ తెలుపుతున్న సమాచారం ప్రకారం మరో మూడు రోజులు ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీనితో ప్రజలు పూర్తిగా ఢీలా పడిపోయారు అని చెప్పాలి. ఇక ఇప్పుడే ఇలా ఉంటే మరో మూడు రోజులు ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయని గ్రహించిన ప్రభుత్వం ముందస్తుగా ఆలోచించి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.