తెలంగాణకు అలెర్ట్…. వచ్చే 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు

-

తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజుల నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో అలెర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందిన హైదరాబాద్ వాతారవణ కేంద్రం హెచ్చరించింది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి, ఖమ్మం, మెదక్, సూర్యాపేట, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మోస్తారు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తామని వెల్లడించింది.

ఇదిలా ఉంటే నిన్నటి రోజు నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. నిన్న రాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి.  దీంతో చేతికంది వచ్చిన మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వర్షాల ప్రభావంతో చలి తీవ్రత కూడా పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version