నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ జలమయమైంది. గంట పాటు కురిసిన భారీ వర్షానికి అతలాకుతలం అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వర్షం ధాటికి రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. సుమారు 18 కాలనీలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, పాతబస్తీ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, జూపార్క్, చైతన్యపురిలలో వర్షం భీభత్సం స్రుష్టించింది. లింగోజీగూడలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
హైదరాబాద్ లో వర్ష భీభత్సం.. నీట మునిగిని లోతట్టు ప్రాంతాలు
-