సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ.. శోభాయాత్రను ఎవ్వరూ ఆపలేరని!

-

సీఎం రేవంత్ రెడ్డికి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ఈ నెల 6న నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. తన లేఖలో రాజాసింగ్ ఇలా రాసుకొచ్చారు.‘శ్రీరామ నవమి శోభాయాత్ర-2025 ఏప్రిల్ 6న గోషామహల్‌లోని ధూల్‌పేట్‌లోని ఆకాశపురి హనుమాన్ మందిర్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్‌లోని HVS పబ్లిక్ స్కూల్‌లో ముగుస్తుంది. నేను 2010 నుండి ఈ శోభయాత్రకు నాయకత్వం వహిస్తున్నాను. ఈ 15 ఏళ్లలో ఒక్క ఘటన కూడా హైదరాబాద్ శాంతికి భంగం కలిగించలేదు.ఈసారి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ACP, DCPల ద్వారా నాపై ఒత్తిడి తెస్తున్నారు. యాత్ర సమయంలో సౌండ్ సిస్టమ్‌ల వాడకాన్ని పరిమితం చేయాలని సౌండ్ కాలుష్యంపై సుప్రీం కోర్టు తీర్పులను ఉదహరించారు.

ఇటీవల AIMIM సమావేశం లౌడ్ సౌండ్ సిస్టమ్‌లు, డీజే మ్యూజిక్‌తో నిర్వహించబడింది. అప్పుడు అధికారులు ఎంుదకు అభ్యంతరాలు తెలపలేదు. ప్రతిఏటా శోభా యాత్రను నిర్వహిస్తే పోలీసులు నాపై కేసులు నమోదు చేస్తారు.కానీ, అవి నన్ను శోభాయాత్ర చేపట్టకుండా ఎప్పుడూ ఆపలేదు.గతంలో కంటే ఈసారి యాత్ర గొప్పగా ఉంటుంది.లక్షలాది మంది రామ భక్తుల భక్తిని ఏ శక్తి ఆపలేదు.సీపీ ఆనంద్‌కు మీరైనా చెప్పి అనుమతులు ఇవ్వాలని చెప్పండి. ఈసారి శ్రీరామ నవమి శోభా యాత్రలో మీరు కూడా పాల్గొనాలని సీఎం రేవంత్‌’కు రాజా సింగ్ ఆహ్వానం పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news