హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో గల 400 ఎకరాల భూముల వేలం నిలిపివేయాలని అటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరంతరంగా ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు సైతం వారికి మద్దతు ప్రకటించాయి.నిన్న బీజేపీ నేతలు వారికి మద్దతుగా అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన టీబీజేపీ ఎంపీలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.HCU భూముల వేలం నిలిపివేయాలని ప్లకార్డులతో నిరసనకు దిగారు.బీజేపీ ఎంపీల నిరసన పక్కనే 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు సైతం ధర్నాకు దిగాయి.