RRRలో ఏ హీరోకు ఎక్కువ న్యాయం.. క్లారిటి ఇచ్చిన రాజమౌళి…

-

కడుపుబ్బా నవ్వించే కామెడీ, సరదాగా సాగిపోయే ఆటపాటలు, సరదా ప్రశ్నలు, అప్పుడప్పుడు కంటతడి పెట్టంచే ఎమోషన్స్​ ఇలా ఎంటర్​టైన్మెంట్​ చేసే షో ‘క్యాష్’​. అయితే ఈ ప్రోగ్రామ్​కు వ్యాఖ్యాతగా సుమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం బ్రహ్మాస్త్రం టీమ్ వచ్చి సందడి చేసింది. ఇందులో రాజమౌళితో పాటు రణబీర్ కపూర్ – అలియా భట్, మౌని రాయ్ ఉన్నారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సుమ రాజమౌళిని ఒక ప్రశ్న అడిగారు. ఆర్ఆర్ఆర్ లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ లలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారనే ప్రశ్నపై డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఏ ఒక్కరికో ఎక్కువో, తక్కువో న్యాయం చేస్తే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేదికాదు. నేను సమ న్యాయం చేశా’ అని చెప్పుకొచ్చాడు. అలాగే సుమ మరో ప్రశ్న కూడా అడిగారు. విజయేంద్రప్రసాద్, కీరవాణిలను తప్పించి సినిమాలు తీసే అవకాశముందా ? అని ఆమె అడిగింది. దీనికి జక్కన్న అది అసాధ్యమని చెప్పుకొచ్చాడు.

ఇక రణ్​బీర్​ కపూర్​, ఆలియా భాట్​ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త’. భారీ అంచనాల మధ్య పాన్​​ ఇండియా చిత్రంగా ప్రపంచ దేశాల్లో విడుదలైంది. అయితే తొలిరోజు మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమా.. రెండో రోజు కూడా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాన్​ హాలిడే రోజు ఈ మూవీ విడుదలైనప్పటికీ భారీ వసూళ్లు సాధించడం పట్ల చిత్ర యూనిట్​ హర్షం వ్యక్తం చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8913 స్క్రీన్లల్లో విడుదలైన ఈ మూవీ రెండో రోజు దాదాపు రూ.85 కోట్ల మేర వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్​ రూ.160 కోట్లకు చేరిందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version