అల్లూ అర్జున్ ‘ వామ్మో ‘ అనుకునే షాక్ ఇచ్చిన రాజమౌళి !!

-

‘నాపేరు సూర్య’ అలాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఆ సమయంలో చాలా మంది డైరెక్టర్లు చెప్పిన స్టోరీలు విన్న అల్లు అర్జున్ చివరికి తనకి గతంలో రెండు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ చెప్పిన అలా వైకుంఠపురం లో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఇటీవల ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది.

మొన్నటి వరకు ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ సంబరాల్లో పాల్గొని ఫుల్ ఎంజాయ్ చేశాడు అల్లు అర్జున్. ఇటువంటి నేపథ్యంలో నెక్స్ట్ సినిమా సుకుమార్ తో చేయబోయే సినిమా విషయంలో సినిమా స్క్రిప్ట్ ఓకే చేసిన సందర్భంలోనే సినిమా రిలీజ్ డేట్ కూడా అల్లు అర్జున్ మరియు సుకుమార్ డిసైడ్ అయ్యారట. అయితే తాజాగా అనుకోకుండా ఎస్ ఎస్ రాజమౌళి RRR సినిమా తేదీని మార్చడంతో అల్లు అర్జున్ కి వామ్మో అనుకునే ఇచ్చినట్లు అయ్యిందని ఫిల్మ్ నగర్ టాక్.

ఎందుకంటే సుకుమార్ తో చేయబోయే సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు మలయాళంలో కూడా విడుదల చేయాలని దానికి తగ్గ స్టోరీ సెట్ చేసుకున్నారట. దీంతో రాజమౌళి తెరకెక్కించే RRR సినిమాపై దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ నెలకొనటంతో పాటు మలయాళం లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉండటంతో…రాజమౌళి తాజాగా ప్రకటించిన తేదీకి అల్లు అర్జున్ ఒక్కసారిగా షాక్ తిన్నట్లు తన మార్కెట్ కి రాజమౌళి డేట్ బొక్క పెట్టినట్లు అయ్యిందని అంటున్నారట. దీంతో సుకుమార్ సినిమా రిలీజ్ విషయంలో అల్లు అర్జున్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version