మ‌రో ఐపీఎల్ టీంకు దెబ్బ‌.. రాజ‌స్థాన్‌కు ఆ కీల‌క ఆటగాడు కొద్ది రోజులు దూరం..!

-

ఈ నెల 19 నుంచి జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ నేప‌థ్యంలో ఇప్ప‌టికే జ‌ట్ల‌న్నీ టోర్నీ కోసం సిద్ధ‌మ‌వుతున్నాయి. ప్లేయ‌ర్లంద‌రూ గంట‌ల త‌ర‌బ‌డి నెట్స్‌లో శ్ర‌మిస్తున్నారు. అయితే సురేష్ రైనా త‌ప్పుకోవ‌డం వ‌ల్ల చెన్నై టీంకు ఎంత పెద్ద దెబ్బ త‌గిలిందో ఇప్పుడు దాదాపుగా రాజ‌స్థాన్ కు కూడా అలాంటి దెబ్బే త‌గిలింది. అయితే అది కేవ‌లం కొన్ని రోజులే. ఎందుకంటే ఆ జ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మ‌న్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ మొద‌టి ఫేజ్‌కు దూరం కానున్నాడు.

స్టోక్స్ ఎంత కీల‌క ఆట‌గాడో అంద‌రికీ తెలుసు. అత‌ను బ్యాట్స్‌మ‌న్‌గానే కాక బౌల‌ర్‌గా కూడా రాణించ‌గ‌ల‌డు. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ జ‌ట్టు అత‌న్ని భారీ మొత్తం చెల్లించి ద‌క్కించుకుంది. అయితే బెన్ స్టోక్స్ లాంటి ఆట‌గాడు మిస్ అవ‌డం.. అందులోనూ టోర్నీ మొద‌టి ఫేజ్ మొత్తానికి టీంకు దూరం కావ‌డం ఆ జ‌ట్టును కొంత ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి కీల‌క ఆట‌గాళ్లు ఉంటే నిజానికి కొన్ని జ‌ట్ల రూపురేఖ‌లే మారిపోతాయి.

అయితే స్టోక్స్ న్యూజిలాండ్‌లో ఉన్న త‌న తండ్రి ఆరోగ్య ప‌రిస్థితి దృష్ట్యా అక్క‌డే ఉన్నాడు. దీంతో కొద్ది రోజుల పాటు అత‌ను అక్క‌డే ఉంటాడ‌ని తెలుస్తోంది. త‌రువాత దుబాయ్‌కు వ‌చ్చినా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. దీంతో ఐపీఎల్ మొద‌టి ఫేజ్‌కు అతను పూర్తిగా దూర‌మ‌వుతాడ‌ని తెలిసింది. అయితే రాజ‌స్థాన్ మాత్రం స్టోక్స్ రాక‌ను ఆశిస్తోంది. మ‌రి స్టోక్స్ ఐపీఎల్ సెకండ్ ఆఫ్‌లోనైనా రాజస్థాన్‌కు అందుబాటులో ఉంటాడో, లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version