రాజస్థాన్ రాయల్స్ కి షాక్.. ఆటకి దూరంగా బెన్ స్టోక్స్..!

-

యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అలాగే లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్‌ 19న రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనుంది. అలాగే ఐపిఎల్-2020 ప్రారంభానికి ముందే సీఎస్కే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా.. రాజస్థాన్ రాయల్స్ కు షాక్ తగలబోతున్నట్టు తెలుస్తుంది.

ఎందుకంటే.. రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టోక్స్ తండ్రి ప్రస్తుతం బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆయన పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. ఇలాంటి సమయంలో స్టోక్స్ తన కుటుంబ సభ్యులతో ఉండటానికే నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఆ జట్టు హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. ఇకపోతే ఈ సారి సీజన్ లో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లకు ప్లాన్ చేస్తుండగా.. గత సీజన్లలో పోలిస్తే అరగంట ముందే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం 4 గంటలకి బదులుగా 3.30కు, రాత్రి 8 గంటలకు బదులుగా 7.30కి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version