ఐపీఎల్ పై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపిఎల్ 2011 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంప దెబ్బ కొట్టినట్లు టేలర్ తెలిపాడు. కాగా గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో మూడేళ్ల పాటు సేవలు అందించిన తర్వాత, టేలర్ ను 2011 వేలంలో రాయల్స్ 4.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కింగ్స్ ఎలేవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో తను డకౌట్ అయ్యాక రాజస్థాన్ రాయల్స్ యజమాని ఒకరు తనపై చేయి చేసుకున్నారని టేలర్ అన్నాడు.
మెహలి వేదికగా రాజస్థాన్ రాయల్స్ – కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. 195 పరుగుల లక్ష్య చేదనలో నేను డకౌట్ గా వెనుదిరిగాను. మేము ఈ మ్యాచ్ లో ఘోర ఓటమిని చవి చూసాం. కనీసం లక్ష్యం దగ్గరకు కూడా చేరలేకపోయాం. మ్యాచ్ అనంతరం మా జట్టు ఆటగాళ్లు సహాయక సిబ్బంది అనంతరం హోటల్ కు చేరుకున్నాము. ఆ తర్వాత మేము అందరం కలిసి హోటల్ పై అంతస్తులుని బార్ కు వెళ్ళాం. అక్కడ షేన్ వార్ను తో పాటు లిజ్ హార్లీ కూడా ఉంది.
ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్ యజమాని ఒకరు నా దగ్గరకు వచ్చారు. రాస్ నువ్వు డకౌట్ అయ్యేందుకు కాదు మేము నీకు మిలియన్ డాలర్లు చెల్లిస్తుందని అన్నాడు. ఈ క్రమంలో అతడు నవ్వుతూ నా చెంపపై మూడు, నాలుగు సార్లు కొట్టాడు. అయితే అతడు నన్ను గట్టిగా మాత్రం కొట్టలేదు. అతడు సరదాగా కొట్టాడో లేక ఉద్దేశపూర్వకంగా చేశాడో నాకు తెలియదు. అప్పటి పరిస్థితుల్లో నేను దాన్ని పెద్ద సమస్య చేయదలచుకోలేదు. కానీ జెంటిల్మెన్ గేమ్ పిలిచే క్రికెట్ లో మాత్రం ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదని తెలిపారు టేలర్.