ఆకట్టుకుంటున్న రజినీకాంత్ “జైలర్” ట్రైలర్ … !

-

రజినీకాంత్ వయసు మీద పడుతున్న తనకు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ కానీ , తనలోని స్టైల్ కానీ అస్సలు తగ్గడం లేదు. తాజాగా రజినీకాంత్ నటించిన చిత్ర “జైలర్”, ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ డైరెక్టర్ తీసిన గత సినిమా బీస్ట్ కలెక్షన్ ల పరంగా పర్వాలేదు అనిపించినా కథ మాత్రం ఆకట్టుకోలేదు. అందుకే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సి ఉంది, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ఇలా అన్నీ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ కు తీసుకువెళ్లాయి. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. కాగా కాసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ను తలపిస్తూ రజినీకాంత్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అని చెప్పవచ్చు. కాగా ఇందులో సునీల్ , యోగిబాబు లతో కామెడీ కూడా బాగానే పండించినట్టున్నాడు.

కాగా ఇప్పటికి కేవలం తమిళ్ ట్రైలర్ ను మాత్రమే చిత్రబృందం రిలీజ్ చేసింది. తెలుగు ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేయనుంది , ఇక సినిమాను ఆగష్టు 10వ తేదీన థియేటర్ లలో రిలీజ్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version