కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు సంబంధించిన ఫైనాన్స్ బిల్లు ను నేడు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఫైనాన్స్ బిల్లు.. ఇటీవల లోక్ సభలో ఆమోదం పొందింది. తాజా గా ఈ రోజు ఫైనాన్స్ బిల్లు, కేటాయింపుల బిల్లులు ఆమోదం కోసం రాజ్య సభ ముందు కు వచ్చాయి. దీంతో రాజ్య సభ సభ్యులు.. ఫైనాన్స్ బిల్లు, కేటాయింపుల బిల్లులకు ఆమోదం తెలిపారు. రాజ్య సభ సభ్యులు వాయిస్ ఓటింగ్ పద్దతి ద్వారా.. ఫైనాన్స్ బిల్లు, కేటాయింపుల బిల్లల కు ఆమోదం తెలిపారు.
ఇటీవల లోక్ సభలో ఆమోదం పొందిన ఫైనాన్స్ బిల్లు… తాజా గా నేడు రాజ్య సభలో కూడా ఆమోదం లభించడంతో.. ఫైనాన్స్ బిల్లు అమల్లోకి రానుంది. ఈ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత రాజ్య సభ వాయిదా పడింది. దీంతో రాజ్య సభ రేపు ఉదయం 11 : 00 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. దీనికి ముందు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు కు సంబంధించిన సవరణ బిల్లును చర్చకు తీసుకువచ్చారు.