ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ కు టీఆర్ఎస్ పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలను సురేష్ రెడ్డికి గులాబీ బాస్ అప్పజేప్పారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా విడుదల అయింది. తమ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ తెలిపింది. కాగ ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్య సభ ఫ్లోర్ లీడర్ గా కే. కేశవ రావు ఉన్నారు.
అయితే కేఆర్ సురేష్ రెడ్డి.. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. 2004 నుంచి 2009లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు. అయితే సురేష్ రెడ్డి… 2018 లో తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లో చేరారు. 2020 లో రాజ్య సభ ఎంపీగా సురేష్ రెడ్డి ఎన్నిక అయ్యారు. తాజా గా రాజ్య సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికయ్యాడు.
Suresh Reddy Garu has been appointed as the Deputy Floor Leader in Rajya Sabha with immediate effect: Telangana Rashtra Samithi. pic.twitter.com/UqSiFJiP20
— ANI (@ANI) March 29, 2022