నిద్రలో నడిచే అలవాటు ఉందా.. ఇది అనారోగ్య సమస్యేనా..?

-

మనం చాలాసార్లు వినే ఉంటాం.. నిద్రలో నడిచే అలావాటు గురించి. అయితే దీన్ని ఎప్పుడూ ఫన్నీగానే తప్ప సీరియస్ గా తీసుకోని ఉండరూ. సినిమాల్లో కూడా నిద్రలో నడిచే సీన్లను కామెడి యాంగిల్ లోనే చూపిస్తారు. అయితే ఇలా నడవడాన్ని వైద్య భాషలో స్లీప్ వాకింగ్, సోమ్నాంబులిజం అని అంటారు. సాధారణంగా చిన్నపిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద వాళ్ళల్లో చాలా రేర్ అని చెప్పవచ్చు. ఈరోజు ఈ స్లీప్ వాకింగ్ కారణాలు, దీని వల్ల ఏమైన ఇతర సమస్యలు వస్తాయా అనేది చూద్దాం.
నిద్రలో నడుస్తున్నప్పుడు కళ్లు తెరచుకొని ఉన్నప్పటికీ.. చుట్టూ ఉన్నవి అంత స్పష్టంగా కనిపించవు. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీయకపోయినా అంతర్లీనంగా ఉన్న అనారోగ్య సమస్యకు సంకేతంగా చెప్పవచ్చు. స్లీప్ వాకింగ్ సాధారణంగా రాత్రి సమయంలో నిద్రలోకి జారుకున్న తరువాత రెండు గంటలలోపు జరుగుతుంది. అయితే మెల్కువ వచ్చిన తరువాత తాను నిద్రలో నడిచానన్న విషయం వారికి ఏమాత్రం గుర్తుండదు. కొంత మంది పిల్లల్లో రోజువారిగా ఇలా జరుగుతుండగా మరికొందరిలో మాత్రం అప్పుడప్పుడు జరుగుతుంది. పగటి పూట నిద్ర సమయంలో స్లీప్ వాకింగ్ ఉండదు.
స్లీప్ వాకింగ్ కారణాలు ఏమై ఉండొచ్చు :
దీనికి కారణాలు అనేకం.. రాత్రి సమయంలో ఎక్కువ సేపు మేల్కోవటం, తగినంత నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి ,జ్వరం, చలి , ప్రయాణం కారణంగా నిద్రలేమి వంటి ఇతర పరిస్థితుల వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రకు , నాడీ వ్యవస్ధకు ఇబ్బంది కలిగించే కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల కూడా ఇలా సంభవించే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.
వంశపారంపర్య కారకాలు, అధిక అలసట, శరీర బలహీనత, నిరంతర తలనొప్పితో మైగ్రేన్ , తలకు బలమైన గాయం వంటి సందర్భాల్లో స్లీప్ వాకింగ్ సమస్య ఎదురవుతుందట. దీనికి వైద్యపరంగా నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే హిప్నాసిస్ వంటి ప్రక్రియలతో దీనికి చికిత్స చేయవచ్చు. ఎవరైనా ఈ సమస్యతో ఉంటే.. లైట్ తీసుకోకుండా.. వైద్యులను సంప్రదిస్తే.. మీలో ఇంకేదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనేది పరీక్షించి చెప్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version