నమస్తే తెలంగాణ ఎండీకి సీఎం కేసీఆర్ కీలక పదవి !

-

తెలంగాన ఉద్యమ బిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు… ఏది చేసినా సంచలనమే అవుతుంది. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. తనదైన రాజకీయ వ్యూహాలను అనుసరిస్తూ.. ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను రాజకీయ పార్టీగా మలచడంలో సీఎం కేసీఆర్ ఎంతో సక్సెస్ అయ్యారు. అలాగే ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లోనూ ఆయన తనదైన వ్యూహాలను అనుసరిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చక్రం తిప్పుతున్నారు సీఎం కేసీఆర్.


ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌ రావు ను రాజ్యసభకు పంపించాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారట. త్వరలో రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… కెప్టెన్ లక్ష్మీకాంతారావు స్థానంలో ఆయనకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.

దీనిపై ఆ నెల 18 వ తేదీన అధిష్టానం అధికారికంగా ఖరారు చేయనుండగా.. 19 వ తారీఖున నామినేషన వేయనునన్నారు. అయితే.. మరో రెండు రాజ్య సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోన్నట్లు సమాచారం అందుతోంది. అందులో ఓసీ, మరొకటి ఎస్సీకి ఛాన్స్‌ ఇచ్చేందుకు కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు ప్రగతి భవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version