కర్ణాటకలో దారుణం.. రోడ్డుపైనే మహిళా లాయర్‌పై దాడి..

-

స్త్రీకి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ముందుగా లేడీస్‌ ఫస్ట్‌ అంటారు. అయితే.. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఇలా వివిధ స్థానాల్లో స్త్రీలను గౌరవిస్తుంటాం. కానీ.. కర్ణాటకలో ఓ మహిళా లాయర్‌పై ఓ దుర్మార్గుడు దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లా కేంద్రంలో భూవివాదం కారణంగా ఓ మహిళా లాయర్ పై దాడి చేశాడో దుండగుడు. మహంతేష్ అనే వ్యక్తి నడిరోడ్డులో అందరూ మౌన ప్రేక్షకుల్లా చూస్తుండగా.. మహిళా లాయర్ పై కిరాతకంగా దాడి చేశాడు. కాలితో పొట్టలో తన్నుతూ, చెంపపై చేత్తో కొడుతూ కొద్ది సమయం పాటు దాడి చేశాడు. ఆమె ఏ దశలోనూ అతడ్ని నిలువరించలేకపోయింది.

ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి, మహంతేష్ ను అరెస్ట్ చేశారు. మహంతేష్, మహిళా న్యాయవాది ఇరుగుపొరుగు వారు. భూ వివాదం నేపథ్యంలో అతడు లాయర్ దంపతులపై దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. సివిల్ వివాదం వల్లే ఆమెపై మహంతేష్ వ్యక్తిగత కక్షతో ఉన్నట్టు చెప్పారు. దాడి సమయంలో లాయర్ భర్త కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా దుండగుడిని అడ్డుకోలేకపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version