న్యూఢిల్లీ: పెగాసస్ సెగతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పెట్రోల్ ధరలు, పెగాసస్‌పై చర్చ జరపాలంటూ లోకసభ, రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ రెండు అంశాలపై చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టాయి. రాజ్యసభలో పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఛైర్మన్ వెల్ వైపు దూసుకెళ్లేందుకు విపక్ష ఎంపీలు ప్రయత్నించారు. దీంతో అధికార ఎంపీలు కూడా నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరస్పర నినాదాలతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభను ఛైర్మన్ వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్షాల అరుపుల మధ్యే వాయిదా తీర్మానాలపై చర్చిస్తున్నారు. సభను అదుపుచేసేందుకు స్పీకర్ ప్రయత్నించినా విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగుతోంది.
రాజ్యసభ వాయిదా.. విపక్షాలపై మోదీ ఆగ్రహం
-