చిన్నారికి అరుదైన లాటరీ… 16 కోట్ల ఇంజెక్షన్​ ఉచితం..

-

కొంత మందికి ఎప్పుడు ఎలా లక్​ కలిసి వస్తుందో చెప్పడం చాలా కష్టం. అనేక బాధలు అనుభవించాక ఒక్కో సారి అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. అదృష్టం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన తర్వాత వచ్చిన లక్​ ను సర్వసాధారణంగా మొదట నమ్మరు. కానీ అటు తర్వాత నెమ్మదిగా నమ్మడం మొదలు పెడతారు. ప్రస్తుతం నాసిక్​ లోని చిన్నారికి కూడా ఇలాగే జరిగింది. అరుదైన జన్యుపరమైన డిసీస్​ తో ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొన్నపుడు అనుకోని అదృష్టం ద్వారా తలుపుతట్టింది. చిన్నారి కి ఉన్న వ్యాధి చికిత్సకు అవసరమైన దాదాపు 16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్​ లాటరీలో ఉచితంగా లభించడం విశేషం. ఇలా అనుకోకుండా వచ్చిన లాటరీతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

spinal muscular atrophy injection

నాసిక్​ కు చెందిన చిన్నారి శివరాజ్​ దావరే స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ అనే అరుదైన వ్యాధితో మంచాన పడ్డాడు. కాగా ఆస్పత్రిలో చూపిస్తే చిన్నారికి అరుదైన జన్యు పరమైన వ్యాధి సోకిందని చికిత్సకు కోట్లలో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కానీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆ చిన్నారి తల్లి దండ్రులకు డాక్టర్ల మాటలు వినే సరికి ఒక్కసారిగా గుండెలు జారిపోయాయి. ఎలాగైనా సరే తమ చిన్నారిని బతికించుకోవాలనే పట్టుదల మాత్రం వారిలో కొండంత ఉంది. కానీ చికిత్సకు అవసరమైన డబ్బులు మాత్రం చేతిలో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక విధినే నమ్ముకున్నారు.

ఇటువంటి సమయంలో ఓ డాక్టర్​ అమెరికాకు చెందిన ఓ సంస్థ చికిత్సకు అవసరమైన మందును ఉచితంగా లాటరీ ద్వారా అందజేస్తుందని అప్లై చేసుకోవాలని తెలిపాడు. అలా దరఖాస్తు చేసుకున్న ఆ తండ్రికి కొన్ని రోజుల్లోనే నమ్మశక్యం కాని రీతిలో ఇంజెక్షన్​ లాటరీలో వచ్చింది. దాదాపు 16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్​ ఉచితంగా లభించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Read More :

ఈ ఐదు అలవాట్లు ఉన్నాయా… ఇక అంతే సంగతులు..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version