రానాతో ప్రేమ వార్తలపై స్పందించిన రకుల్.. ఏం చెప్పిందంటే..?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అవకాశాలు తగ్గినా, వార్తల్లో మాత్రం ఎక్కువగానే ఉంటోంది. ప్రత్యేకంగా ఫొటో సెషన్స్‌ చేసుకుని ఆ ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ నెటిజన్లకు పనిచెబుతోంది. అయితే హీరో రానా, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య లవ్ ఎఫైర్ ఉందన్న వార్తలు చాలా రోజులుగా సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రేమలో పడిందని, అవకాశాలు తగ్గడంతో.. పెళ్లి ఆలోచనలో పడిందన్న‌ ప్రచారాలు కూడా బాగా వైరల్‌ అవుతున్నాయి.

అయితే వీటిపై స్పందిన ర‌కుల్.. రానాకు, తనకు మధ్య ప్రేమ ఉందన్న వార్తలు అవాస్తవమని చెప్పింది. తామిద్దరి ఇళ్లు కేవలం రెండు నిమిషాల్లో వెళ్లేంత దగ్గరగా ఉంటాయని, తాను సినిమాలకు పరిచయం కాకముందు నుంచే రానా తెలుసునని చెప్పింది. ఇద్దరమూ ఎన్నడూ డేటింగ్ కు వెళ్లలేదని, రానా మరో యువతితో ప్రేమలో ఉన్నాడని రకుల్ వ్యాఖ్యానించారు.

తాము స్నేహితులుగానే ఉన్నామని, రానా సహా తన హీరోలందరితో అలాగే ఉన్నానని అంది. ఇంతవరకూ తాను ఎవరితోనూ లవ్ లో పడలేదని, ఇంకా సింగిల్‌ గానే ఉన్నానని రకుల్ అంటోంది. అలాగే తన‌కు అవకాశాలు తగ్గడం కాదని, తానే తగ్గించుకుంటున్నానని, నటనకు అవకాశం ఉన్న పాత్రలైతేనే నటించడానికి అంగీకరిస్తున్నానని చెప్పుకొస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version