మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమా అతి త్వరలో ప్రారంభం కానుంది. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా లాంచ్ చేస్తారని కొంత మందంటే? సైరా నరసింహారెడ్డి రిలీజ్ తర్వాతే సెట్స్ కు వెళ్లేదని ఇంకొంత మంది భావిస్తున్నారు. వాటన్నటింపై క్లారిటీ రావాలంటే ఆగస్టు 22 వరకూ వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతం కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. చిరంజీవి హీరోయిన్ ఎంపికపై ప్రధానంగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే కొంత మంది భామల పేర్లు వినిపించాయి. కానీ ఇంకా ఎవర్నీ ఫైనల్ చేయలేదు.
ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర రూమర్ రచ్చ కెక్కింది. ఇందులో మెగాస్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తెరను పంచుకుంటున్నట్లు నేటి ఉదయం నుంచి ఒకటే స్పెక్యులేషన్స్. గతంలో చిరు-చరణ్ లు కలిసి తెరను పంచుకున్న సంగతి తెలిసిందే. మగధీరలో ఓ పాటలో చిరు స్టెప్పులేయగా, ఖైదీనంబర్ 150 లో చరణ్ స్టెప్పులు, బ్రూస్లీలో ఓ సీన్ లోచిరు కనిపిస్తారు. ఈ నేపథ్యంలో కొరటాల సినిమాలో చరణ్ కనిపిస్తాడని ఊహాగానాలొస్తున్నాయి. అయితే వీటిలో నిజమెంత? అని ఆరా తీయగా ఆ అవకాశమే లేదని మెగా కాపౌండ్ వర్గాలు రూమర్లను కొట్టిపారేసాయి.
ఇది సీరియస్ గా సాగే కథ అని, చిరంజీవి కొంత మంది తెలుగు నటులు తప్ప కీలకమైన విలన్ పాత్రకు, సపోర్టింగ్ రోల్స్ కు బాలీవుడ్ నటులనే తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఎప్పుడు సినిమా ప్రారంభం అవుతుంది? హీరోయిన్ గా ఎవర్ని ఎంపిక చేసారు అన్న ప్రశ్నలకు మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ మరో సంస్థంతో కలిసి నిర్మిస్తోంది.