Ram Charan: మూడో వారంలో RRR ..సినిమాపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ తారక్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ విజ్యువల్ వండర్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు. గత నెల 25న విడుదలైన ఈ పిక్చర్ మూడో వారంలోకి ఎంటరవుతున్నది. రికార్డులను తిరగరాస్తూ ముందుకు సాగుతున్న ఈ చిత్రం హిందీ ఇండస్ట్రీలో రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరింది.

ఈ క్రమంలోనే RRR ఫిల్మ్ సెలబ్రేషన్స్ లోనూ మూవీ యూనిట్ సభ్యులు హీరోలు, దర్శకుడు, ప్రొడ్యూసర్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మాస్టర్ స్టోరి టెల్లర్ తెరకెక్కించిన చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ చూడాలని ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సూచించారు. ఈ సినిమా మూడో వారంలోకి ఎంటర్ అవడం పట్ల రామ్ చరణ్ స్పందించారు.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా రామ్ చరణ్ తన ఫొటోతో ఆర్ ఆర్ ఆర్ ఫిల్మ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ క్యాప్షన్ లో చేశాడు. అది చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. జక్కన్న తెరకెక్కించిన RRR చిత్రాన్ని 3D వర్షన్ లో ఎక్స్ పీరియెన్స్ చేయాలని సూచించాడు. విజ్యువల్ వండర్ అలా త్రీ డీలో చూస్తే అద్భుతంగా ఉందనే ఉద్దేశంతో రామ్ చరణ్ ఈ పోస్టు పెట్టారు.

ఈ పోస్టును చూస్తుంటే చరణ్ ప్రజెంట్ RRR సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనబడుతోంది. ఫొటోలో రామ్ చరణ్ స్టైలిష్ లుక్ తన నెక్స్ట్ మూవీ కోసమేనని ఈ సందర్భంగా నెటిజన్లు గెస్ చేస్తు్న్నారు. రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీని ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ పిక్చర్ తర్వాత జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నారు. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఓ చిత్రం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version