Ram Charan: తండ్రికి తగ్గ తనయుడు.. RRRలో హీరోల ప్రయారిటీపై రామ్ చరణ్ డిప్లొమాటిక్ ఆన్సర్

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRR. ఈ చిత్రంలో రామ్ చరణ్, తారక్ కలిసి నటించారు. ఈ చిత్రం గత నెల 25న విడుదలై మూడో వారంలోకి ఎంటరై రూ.1,000 కోట్లు కలెక్షన్స్ చేసి ఇంకా దూసుకుపోతున్నది. కాగా, ఈ ఫిల్మ్ అనౌన్స్ మెంట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది చిత్రంలో హీరోల ప్రాధాన్యత గురించి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు.

ప్రోమోలు, టీజర్లు పక్కనబెడితే. చిత్రంలో తారక్ పాత్ర కంటే రామ్ చరణ్ పాత్రకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని తారక్ అభిమానులు కొందరు ఆందోళన చెందారు. కానీ, తారక్ మాత్రం తన పాత్ర అద్భుతమని ఫీలయ్యాడు. ఈ విషయమై ఎవరికి రాజమౌళి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు? మీ పాత్రనే సినిమాలో ఎక్కువ హైలైట్ అయిందని తాజాగా ముంబైలో మీడియా వారు రామ్ చరణ్ ను క్వశ్చన్ చేశారు.

తారక్ తన పక్కనే కూర్చొని ఉండగా, ఇటువంటి ప్రశ్న రామ్ చరణ్ కు రావడం ఇబ్బందికరమే. కాగా, ఆ ప్రశ్నకు వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చి తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడు రామ్ చరణ్ అని అనిపించుకున్నాడు. హీరోను ఇరకాటంలో పెట్టేందుకే ఇటువంటి ప్రశ్నను మీడియా వారు అడిగారు. కాగా, రామ్ చరణ్ ఏ మాత్రం బెదరకుండా ఫెంటాస్టిక్ ఆన్సర్ ఇచ్చారు.

తన పాత్ర తారక్ కంటే బెటర్ గా ఎలివేట్ అయిందని ఎవరైనా అంటే తాను అస్సలు ఒప్పుకోబోనని, ఫిల్మ్ లో ఇద్దరి రోల్స్ వండర్ ఫుల్ గా ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. తమకు ఇటువంటి గొప్పి చిత్రాన్ని ఇచ్చిన జక్కన్నకు థాంక్స్ చెప్పారు చెర్రీ. అలా వెరీ డిప్లొమాటిక్ గా ఆన్సర్ ఇచ్చేసి వావ్ అనిపించాడు. RRR తర్వాత రామ్ చరణ్, తారక్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version