మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం తెలుగు నాట నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా 200 కోట్లతో టాలీవుడ్లో చరిత్ర సృష్టించింది. ఆ రికార్డును బ్రేక్ చేయాలని మహేష్ బాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు గానీ వీలవ్వడం లేదు. భరత్ అనే నేను, మహర్షి కేవలం 150 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలుగు సహా అమెరియా మార్కెట్ లోనూ చిట్టిబాబుతో మహేష్ పోటీ పడినా పనవ్వలేదు. అప్పట్లో మగధీరతో 100కోట్లు..రగస్థలంతో 200 కోట్ల చరిత్ర మెగా ఫ్యామిలీకే దక్కడం విశేషం. తాజాగా రంగస్థలం కన్నడలోనూ సునామీ సృష్టిస్తోందిన తెలిసింది. నిన్నటి రోజునే సినిమా ఆ రాష్ర్టంలో డబ్బింగ్ రూపంలో విడుదలైంది.
తొలి షోతోనే మౌత్ టాక్ దూసుకుపోయింది. ముఖ్యంగా మాస్ అభిమానులు చిట్టిబాబు పాత్రకు బాగా కనెక్ట్ అవుతుండటంతో అక్కడా భారీ వసూళ్లు సాధిండడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో పక్క గ్రామీణ నేపథ్యం గల సన్నివేశాలకు లోకల్ పీపూల్స్ కనెక్ట్ అవ్వడం సినిమాకు కలిసొస్తుందని చెబుతున్నారు. తొలి రోజు కొన్ని థియేటర్లు ఖాళీగా ఉన్నప్పటికీ మౌత్ టాక్ బాగా రావడంతో ఆన్ లైన్ బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగాయట. కర్ణాటకలో మెగా స్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకమైన క్రేజ్. ఆయన పేరిట అక్కడా తెలుగు అభిమాన సంఘాలున్నాయి. అఖిల భారత చిరంజీవి యువత అక్కడా తమ సేవల్ని కొనసాగిండచంతో చిరు ఇమేజ్ మరింత పెరిగింది.
ఇవన్నీ మెగా హీరోలు క్యాష్ చేసుకుంటున్నారు. గతంలో చరణ్ నటించిన కొన్ని సినిమాలు విడుదలయ్యాయి .కానీ పెద్దగా ఆడలేదు. రంగస్థంలో మాత్రం అంచనాలను అందుకుంది. దీంతో చరణ్ తదుపరి సినిమాలను కూడా అక్కడ రిలీజ్ చేయాలని భావిస్తున్నారుట. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. ది కర్ణాటకలో రిలీజ్ అవ్వడం ఖాయం. తారక్ కి అక్కడా అభిమానులున్నారు. ఈ నేపత్యంలో చరణ్ కి ఆర్ ఆర్ ఆర్ బూస్టింగ్ సినిమాలా నిలుస్తుంది.