SHOCKING: బోయపాటి “స్కంద” ఓటిటి రిలీజ్ వాయిదా !

-

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరియు క్లాస్ అబ్బాయి రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన మొట్టమొదటి సినిమా స్కంద బాక్స్ ఆఫీస్ వద్ద తన గర్జనను చాలా ఎక్కువగా వినిపించింది. గత నెల సెప్టెంబర్ 28వ తేదీన విడుదలైన స్కంద మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని భారీ వసూళ్లను సాధించి పెట్టింది. ఇందులో రామ్ సరసన శ్రీలీల మరియు సాయి మంజ్రేకర్ లు నటించి మెప్పించారు. కాగా డిస్నీ హాట్ స్టార్ లో అక్టోబర్ 27వతేదీన విడుదల చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అదికారికంగా మేకర్స్ నుండి అందిన సమాచారం ప్రకారం రేపటి నుండి డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కావడం లేదట. ప్రస్తుతానికి వాయిదా పడగా, నవంబర్ రెండవ వారంలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మరో రెండు వారాలు ఆగక తప్పడం లేదు. మరి ఈ వాయిదాకు గల కారణం ఏమిటన్నది మాత్రమే ఇంకా తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version