దుమారం రేపుతున్నప‌వ‌న్‌పై వ‌ర్మ కామెంట్లు..

-

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చి ఆయ‌న అభిమానులు, రాజ‌కీయ‌నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని వేడుకుంటున్నారు. కాగా ఇలాంటి టైమ్ లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను రెచ్చ‌గొట్టేలా రామ్‌గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మ‌రీ ఇంత నీచంగా ట్వీట్ చేస్తావా అంటూ వ‌ర్మ‌పై మండిప‌డుతున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌. ఇప్ప‌టికే చాలాసార్లు ప‌వ‌న్‌కు వ‌ర్మ‌కు క్లాషెస్ వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే. కాగా ఈ నేప‌థ్యంలో వ‌ర్మ కామెంట్లు దుమార‌మే రేపుతున్నాయి.

గ‌త రెండు మూడు రోజులుగా క‌రోనాపై వ‌ర్మ వ‌రుస ట్వీట్లు చేస్తూ చ‌ర్చ‌కు దారితీస్తున్నాడు. కాగా ఇప్పుడు మ‌రో ట్వీట్‌తో సంచ‌ల‌నంగా మారాడు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో జ‌రిగిన‌ కుంభమేళాపై ట్వీట్ చేస్తూ కరోనావైరస్ వ్యాప్తిగా ప్రధాన సాధనంగా కుంభ‌మేళా ఉందంటూ చెప్పాడు వ‌ర్మ. గతేడాది జమాతే సమ్మేళనం.. ఈ ఏడాది కుంభమేళ కరోనా వ్యాప్తికి ప్ర‌ధాన కార‌ణాలు అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశాడు. కుంభమేళా మీద హారర్ సినిమా తీస్తారా అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆర్జీవి త‌న‌దైన స్టైల్‌లో మరో సైటెర్ వేసేశాడు. కుంభమేళా హారర్ ఫిలిం అయితే కొవిడ్ హీరో అంటూ వ‌ర్మ ట్వీట్ చేశాడు. ఇక రాజకీయ నేతలపై ట్వీట్ చేస్తూ.. కుంభమేళా, రాజకీయ ర్యాలీలను చూస్తుంటే రాజకీయ నేతలు ఓట్ల కోసమే శ్రమిస్తున్నారు కాని వారికి ప్రజల క్షేమం పట్టదంటూ విమ‌ర్శించాడు.

పవన్ కు కరోనావైరస్ పాజిటివ్ అని తెలియ‌గానే దీనిపై కూడా వ‌ర్మ ట్వీట్ చేశాడు. ప‌వ‌న్ క్వారంటైన్ లో ఉన్న ఫోటోను ఉద్దేశించి వర్మ ఓ కామెంట్ చేశాడు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. ఆ వైరస్ ముండలని పచ్చడి చేసి చంపేయండి అంటూ రాసుకొచ్చాడు. అలాగే క‌రోనా అనే నీచ‌మైన పురుగు కూడా ప‌వ‌న్‌ను ప‌డుకోబెట్టింది అంటే హీరో అనే ప‌దం ఉన్న‌ట్టా లేన‌ట్టా అని దుమారం రేపే కామెంట్లు చేశాడు. దీనిపి ప‌వ‌న్ ఫ్యాన్స్ భ‌గ్గుమంటున్నారు. చూడాలి మ‌రి ఇది దేనికి దారి తీస్తుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version