RGV: “మా” వాళ్లు నిజంగా స‌ర్కస్ వాళ్లు.. ఆర్జీవీ సెటైరిక‌ల్ ట్విట్

-

RGV: ఆర్జీవీ.. వివాదాల‌కు ఆయ‌న కేరాఫ్‌. ఆయ‌న ఇండస్ట్రీలో ఓ సంచలనం. తనకు సంబంధం ఉన్నా, లేకపోయినా అన్ని అంశాల్లో ‘ట్వీటు’ పెట్టే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయ‌న కంట‌పడ్డ ప్ర‌తి విష‌యంపై ఒదోక ర‌కంగా కామెంట్ చేస్తున్నే ఉంటాడు. ఇటీవల ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక‌లు మునుపు ఎన్నాడు లేని విధంగా మంచు విష్ణు, ప్రకాష్‌ రాజ్‌ ప్యానెళ్లు రెండు కూడా మాటల దాడులు చేసుకున్నారు.

కాగా తాజా ‘మా’ పరిణామాలపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ‘మా’లోని మొత్తం వ్యవహారం చూస్తుంటే సర్కస్‌ని తలపించేలా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో ఆర్జీవీ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. మా ఎన్నిక‌ల ప్రారంభంలోనూ ఇదే ర‌కం ట్విట్ చేశాడు. అప్పుడెప్పుడో లోకల్, నాన్-లోకల్ అంశపై ఓ సెటైరికల్ ట్వీట్ వేసి లైట్ తీసుకున్నారు. తాజాగా తీరిగ్గా ఓ ట్వీట్ వేశారు. లేటుగా వేసినా ‘మా’ పరిణామాలపై తన వెర్షన్‌ను ఒక్క మాటలో తేల్చేశారు.

ఇటీవల బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ కుమారుడిని సైతం విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఆర్జీవీ వరంగల్‌లోని కొండా సురేఖ, మురళీ దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా ‘కొండా’ పేరుతో సినిమా రూపొంది స్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version