RED టీజర్ వచ్చేస్తోంది.. ఇక రచ్చ రచ్చే..!!

-

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పూర్తిగా రూట్ మార్చేశాడు. ఇస్మార్ట్ శంకర్‌తో అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు రామ్. తన లుక్, భాష, యాస, యాటిట్యూడ్ ఇలా ప్రతీ ఒక్కటి మార్చేసి ఇస్మార్ట్‌ శంకర్‌లో రెచ్చిపోయాడు. రామ్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. చాక్లెట్ బాయ్ లుక్‌లోంచి పూర్తిగా మారిపోయి కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఈ క్రమంలోనే RED అనే చిత్రం చేశాడు.

తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసేసిన చిత్రయూనిట్ ఇక ప్రమోషన్ కార్యక్రమాలను పెంచింది. ఈ సినిమాలో పాటల చిత్రీకరణ కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉన్న డోలమైట్ అనే ప్రాంతంలో అదిరిపోయే లొకేషన్లలో పాటను చిత్రీకరించినట్టు ప్రకటించారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.

రెడ్ టీజర్‌ను విడుదల చేసి హైప్ పెంచేందుకు రెడీ అయింది చిత్రయూనిట్. ఫిబ్రవరి 28 సాయంత్రం ఐదు గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో రామ్‌కు జోడిగా.. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఈ మూవీ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version