తెరాస గూటికి చేరిన రామగుండం ఎమ్మెల్యే… 

-

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోక తెరాస తరుఫున టికెట్ ఆశించి బంగపడ్డ తెరాస రెబల్ అభ్యర్థి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో కారెక్కారు. ఈ సందర్భంగా చందర్‌కు గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో.. రామగుండం నుంచి ఫార్వార్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా పోటీ చేసి  టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై.. చందర్ 26,090 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

పార్టీలోకి తిరిగి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…  తిరిగి తన సొంత గూటికి రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో.. కేటీఆర్ బాటలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని భావించి పార్టీలో చేరుతున్నట్లు చందర్ తెలిపారు. రామగుండంలో మెడికల్ కాలేజ్, మైనింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రామగుండం నుంచి లక్ష ఓట్లు టీఆర్ఎస్‌కు పడాలని పిలుపునిచ్చారు. ఇక మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సేవలను పార్టీ వినియోగించుకుంటుందని కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version