చరణ్ సీక్రెట్ బయటపెట్టిన కియరా

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న పవర్ ప్యాక్డ్ మూవీ వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది.

ఇక రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకు సంబందించిన ఇంటర్వ్యూస్ లో కియరా అద్వాని చరణ్ కు సంబందించి ఓ పర్సనల్ విషయాన్ని షేర్ చేసింది. చరణ్ సీక్రెట్ గా ఓ ఇన్ స్టాగ్రాంను మెయింటైన్ చేస్తున్నాడని బాంబ్ పేల్చింది కియరా. అంతేకాదు సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా సైలెంట్ గా ఉంటూ హీరోతో మాత్రం డిమాండింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది.

చరణ్, కియరా పెయిర్ చూడముచ్చటగా ఉంది. భరత్ అనే నేను హిట్ తో సూపర్ హిట్ అందుకున్న కియరా ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక అమ్మడికి తిరుగు ఉండదు. ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version