గోదావరిఖని లో ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా ఎన్టీపీసీ అధికారులపై మండిపడ్డారు ఎమ్మెల్యే. నిర్వాసితులకు ఉద్యోగాలు.. ఉపాధి కల్పించడంలో విఫలమైందని ఎన్టీపీసీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కొత్తగా వచ్చే ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు.. గతంలో మోసం చేసిన విధంగానే ఎన్టీపీసీ అధికారుల తీరు ఉంది అని ఆరోపించారు.
ఇక్కడ ఇల్లు భూమి సర్వస్వం కోల్పోయిన గ్రామాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎన్టీపీసీ పై ఉంది. కానీ ఉద్యోగాలను 2 లక్షలకు ఒకటి చొప్పున అమ్ముకుంటున్నారు.. కాబట్టి ఉద్యోగాలను అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అందుకే ఎన్టీపీసీ పవర్ ప్లాంట్స్ వల్ల ఇబ్బందులు పడుతున్న రామగుండం ప్రాంతాన్ని ఎన్టీపీసీ దత్తత తీసుకోవాలి. ఈ విషయంలో కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.. ప్రజల కోసం పోరాడుతున్న నన్ను అడ్డుకుంటున్నారు.. కానీ ఉద్యోగాలు కలెక్టర్ ద్వారా ఇవ్వాలి.. కాంట్రాక్టర్ ద్వారా ఉద్యోగాలు ఇస్తే అమ్ముకుంటారు అని అన్నారు రాజ్ ఠాకూర్.